తెలుగు స్టేట్స్ లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన డబ్బింగ్ మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
తెలుగు భాషా సినిమాలను మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలను ఆదరించడంలో కూడా తెలుగు ప్రేక్షకులు ముందు వరుసలో ఉంటారు. దానితో ఎన్నో ఇతర భాష సినిమాలకు కూడా తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన కలెక్షన్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.
యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 19.09 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.O సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.45 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. రజినీ కాంత్ హీరోగా రూపొందిన కబలి సినిమా 9.31 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలవగా , తలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో సినిమా మొదటి రోజు 8.31 కోట్ల షేర్ కలెక్షన్లను చేసి నాలుగువ స్థానంలో నిలిచింది.

శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందిన ఐ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.56 కోట్ల కలెక్షన్ వాసులు చేసి ఐదవ స్థానంలో నిలవగా , రజనీ కాంత్ హీరోగా రూపొందిన జైలర్ మూవీ మొదటి రోజు 7.01 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఆరవ స్థానంలోనూ , కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందున భారతీయుడు 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 6.75 కోట్ల కలెక్షన్ చేసి ఏడవ స్థానంలో నిలిచింది.

దళపతి విజయ్ హీరోగా రూపొందిన మాస్టర్ సినిమా మొదటి రోజు 6.01 కోట్ల కలెక్షన్ చేసి ఎనిమిదవ స్థానంలోనూ , అలాగే విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ సినిమా 4.81 కోట్ల కలెక్షన్లను చేసి తొమ్మిదవ స్థానంలోనూ నిలిచాయి. రజనీ కాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన దర్బార్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల కనెక్షన్లను చేసి పదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: