ఆ దర్శకులతో సినిమాలు చేయడానికి ఎన్టీఆర్ భయపడుతున్నారా..?

murali krishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది.ఎన్టీఆర్ తో  రాజమౌళి ,వి.వి.వినాయక్ వంటి స్టార్  డైరెక్టర్స్ తమ మొదటి సినిమాలు చేసారు.కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ కొత్త దర్శకులకి వరుస అవకాశాలు ఇచ్చారు.చిన్న వయసులోనే ఎన్టీఆర్ కు తిరుగులేని స్టార్ డం వచ్చింది.సినిమాలు చేయడం ప్రారంభించిన తక్కువ కాలంలోనే ఎన్టీఆర్ తిరుగులేని మాస్ హీరోగా ఎదిగారు.ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా మాస్ ఎలిమెంట్స్ ఉండాల్సిందే.ప్రస్తుతం ఎన్టీఆర్ భారీ యాక్షన్ ఫిలిమ్స్ లో నటిస్తున్నారు.ఇదిలా ఉంటే కొంత మంది యంగ్ డైరెక్టర్స్  ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు కథలను సిద్ధం చేసుకున్నారు.వారిలో సుధీర్ వర్మ ఒకరు.. 

హీరో నిఖిల్ తో స్వామి రారా వంటి సూపర్ హిట్ సినిమా చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేసుకున్నారట .ఆ కథను ఎన్టీఆర్ కి వినిపించగా పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం.అయితే  సినిమా మాత్రం పట్టాలెక్కలేదు.అలాగే పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్  అందుకున్న తరుణ్ భాస్కర్ ఎన్టీఆర్ కోసం అదిరిపోయే స్టోరీ సిద్ధం చేశారట.ఒకానొక సమయంలో వీరిద్దరి కాంబో లో ఓ పవర్ ఫుల్ మూవీ రాబోతుందని ప్రచారం జరిగింది.అయితే ఈ కాంబినేషన్ కూడా వర్క్ అవుట్ కాలేదు.తనకి ఫుల్ మాస్ ఇమేజ్ ఉండటంతో ఈ కొత్త దర్శకులు తనని సరిగ్గా  ప్రెజెంట్ చేయగలరా అనే అనుమానంతో ఎన్టీఆర్ వారితో సినిమా చేసేందుకు వెనకడుగు వేసినట్లు సమాచారం.గతంలో ఇలానే తన ఇమేజ్ కు సంబంధం లేని కథలలలో నటించడంతో ఆ సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచాయి.దీనితో యంగ్ డైరెక్టర్స్ తో  సినిమాలు చేసేందుకు ఎన్టీఆర్  భయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: