జవాన్ తర్వాత పూర్తిగా మారిన నయనతార... బాలీవుడ్ గాలి బాగానే సోకినట్టుందే..?

MADDIBOINA AJAY KUMAR
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత తెలుగు సినిమాలలో కూడా నటించడం స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఈమె తెలుగులో కూడా అనేక సినిమాలలో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే ఈమె తెలుగులో అత్యంత క్రేజ్ ఉన్న హీరోయిన్ స్థాయికి వెళ్లిన తర్వాత మళ్లీ తమిళ సినిమాల పైన ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది.


అందులో భాగంగా తెలుగు సినిమాలలో నటించడం కూడా చాలా వరకు తగ్గించింది. ఇకపోతే ఈమె కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో హాట్ అందాలను అరబోసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తన అందాలతో కుర్రకారుకు హిట్ పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈమె పెళ్లి తర్వాత మాత్రం అందాల షో కు కాస్త దూరంగానే ఉంటూ వస్తుంది. ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈమె షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.


ఈ మూవీ తో ఈమెకు హిందీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే పెళ్లి తర్వాత చాలా కాలం పాటు గ్లామర్ షో కు దూరంగా ఉన్న నయన తార ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త అందాలను ఆరబోస్తూ వస్తుంది. రీసెంట్ టైమ్ లో ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని ఫోటో షూట్ లను కూడా నిర్వహిస్తోంది. ఆ ఫోటోలను ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లి పోస్ట్ చేస్తూ ఉండగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అవుతున్నాయి. అలా ఈమె ఈ మధ్య కాలంలో తన గ్లామర్ షో తో ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ను ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: