భార‌తీయుడు 2 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు.. ఇంత పెద్ద రాడ్ దింపారేంటి భ‌య్యా..?

murali krishna
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "భారతీయుడు 2 " తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్ ,సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ "భారతీయుడు" సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,ప్రియా భవాని శంకర్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటించగా బాబీ సింహ ,ఎస్.జె.సూర్య ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందించారు.ఈ సినిమాను మేకర్స్ జులై 12 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసారు.భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది.శంకర్ ఇన్నేళ్లు కష్టపడి తీసిన సినిమా ఇదేనా అని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.

సినిమాలో ఎక్కడ కూడా శంకర్ మార్క్ కనిపించలేదు సినిమా మొత్తం బోరింగ్ సీన్స్ తో నింపేశారు.కమల్ హాసన్ నటన బాగున్నా కూడా సరైన టేకింగ్ లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించ లేదు.ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు.ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా కేవలం రూ.26కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.అయితే,ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వరకు వసూలు చేస్తుందని మేకర్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశారు.కానీ,అందుకు పూర్తి భిన్నంగా ఈ సినిమా  కలెక్షన్స్ వచ్చాయి.

ఈ మూవీ తమిళంలో రూ.17 కోట్లు,తెలుగులో రూ.7.7కోట్లు మరియు హిందీ వెర్షన్‌లో కేవలం రూ.1.2కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం.అంతేకాదు,హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలం అయింది. నార్త్ అమెరికాలో$1 మిలియన్‌ను వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు తెలిపారు.టాక్ బాగోలేకపోవడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఎన్నో అంచనాలతో థియేటర్స్ కు వచ్చిన ప్రేక్షకులకు శంకర్ భారీ రాడ్ సినిమా ఇచ్చారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: