వాళ్లు నా ఫ్లాప్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్..?

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే అక్షయ్ కుమార్ చాలా మంది హీరోల మాదిరి కాదు. ఆయన ఎప్పుడు ఖాళీ ఉండకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఉంటాడు. దానితో ఆయన నటించిన సినిమాలు సంవత్సరానికి ఐదు , ఆరు విడుదల అవుతూ ఉంటాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం అక్షయ్ కుమార్ సంవత్సరానికి ఐదు , ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తే అందులో కనీసం మూడు , నాలుగు అయిన మంచి విజయాలను అందుకుంటు ఉండేవి.

కానీ అక్షయ్ కుమార్ కు మాత్రం ఈ మధ్య కాలంలో చాలా అపజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అందాయి. ఈయన ఈ మధ్య కాలంలో నటించిన పది సినిమాలలో దాదాపు 8 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. రెండు సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా అక్షయ్ కుమార్ "సర్ఫెర" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ సూర్య హీరో గా రూపొందిన తమిళ సినిమా అయినటువంటి సురారై పొట్రు మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఈ సినిమా నిన్న విడుదల అయింది.

ఈ మూవీ విడుదల సందర్భంగా తాజాగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ నా అపజయాలను కొంత మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వాతావరణం నేను ఎక్కడా చూడలేదు. ఒకరు కిందకు పడిపోతూ ఉంటే దాన్ని చూసి ఎంజాయ్ చేసేవారు కూడా ఉంటారు అని ఆయన అన్నాడు. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: