ప్రభాస్ కల్కి ఓటిటి రిలీజ్ డేట్ ఫీక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

murali krishna
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జానర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. ఇలా భారీ తారాగణంతో జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.900 కోట్లు దాటేసిన ప్రభాస్ సినిమా రూ. 1000 కోట్ల మార్క్ కు అతి చేరువలో ఉంది. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ కల్కి సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. నాగ్ అశ్విన్ టేకింగ్, ప్రభాస్, అమితాబ్, దీపికల యాక్టింగ్, గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ కల్కి సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో జనాలు థియేటర్లలకు పరుగుల పెడుతున్నారు.ప్రస్తుతం థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తోన్న కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ సొంతం చేసుకున్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఒక్క హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.ఇదిలా ఉంటే థియేట్రికల్ రిలీజ్ తర్వాత సుమారు 7-8 వారాల తర్వాతే కల్కి సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని కల్కి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ముందే డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి ‘కల్కి’ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది సినిమాను చూసే అవకాశముంది. కాబట్టి ఓటీటీ సంస్థలు కూడా ఈ తేదీనే లాక్ చేయనున్నాయని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోసారి తన అభిమాన హీరోను బుల్లితెరపై కూడా చూడాలని ఆశపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: