మోక్షజ్ఞ సినీ ఎంట్రీ నీ మరింత స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న బాలయ్య..!!

murali krishna
నందమూరి అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ ఇంటి నుంచి మరో వారసుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. అతను మరెవరో కాదు నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ.ఎప్పటి నుంచో బాలయ్య కుమారుడు సినిమాల్లోకి వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెర పడనుంది. మోక్షజ్ఞ ఎంట్రీకీ రంగం సిద్ధమైందని తెలుస్తోంది.మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్దమైనట్లు సమాచారం. బాలకృష్ణ తన తనయుడిని 2025 లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని కోసం నటనకు సంబంధించిన శిక్షణతో పాటు పూర్తి ఫిట్నెస్ తో రెడీ అయ్యాడని టాక్‌. మోక్షజ్ఞ కొత్త లుక్ ఒకటి షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు చాలా బొద్దుగా కనపడే మోక్షజ్ఞ , ఇప్పుడు ఒక హీరోకి కావల్సిన క్వాలిటీస్ తో చాలా ఫిట్ గా రెడీ అయ్యాడు. బాలయ్య బాబు పలువురితో చర్చలు జరుపుతున్నప్పటికి ఇంకా కథ , దర్శకుడిని ఎంపిక చేయలేదట. . తమ సొంత బ్యానర్ లో కాకుండా పెద్ద బ్యానర్ ద్వారా పరిచయం చేయాలని బాలకృష్ణ ఆలోచన అని సన్నిహితులు చెబుతున్నారు. ఓ వైపు బాలయ్య కుమార్తెలు బ్రాహ్మిణి, తేజశ్విని కూడా తమ తమ్ముడు మోక్షజ్ఞ ను తమ నిర్మాణ సంస్థ ద్వారా తెరకు పరిచయం చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ అవసరం అనుకుంటే మోక్షజ్ఞ కోసం నిర్మాణ రంగంలో అడుగుపెట్టడానికి సిద్దంగా ఉన్నారంట బ్రాహ్మిణి.ఇప్పటికే బాలయ్య చిన్న కూతురు తేజశ్విని తండ్రికి సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటుంది. షూటింగ్ ల దగ్గరి నుంచి అన్ని షోల వరకు తను దగ్గరుండి చూసుకుంటుంది.సినిమాల పట్ల తపన ఉన్న నిర్మాత వంశీ. మరో మంచి కలయిక కూడా ఉంది. త్వరలోనే దాన్ని ప్రకటించబోతున్నాం అంటూ మోక్షజ్ఞ సినీ ఎంట్రీని మరోసారి కన్ఫర్మ్ చేస్తూ నందమూరి అభిమానుల్లో జోష్ నింపారు బాలకృష్ణ. మొత్తం మీద చూస్తే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా మొదలు కానుందనే హింట్స్ అయితే ఇస్తున్నారు.ఇదే సినిమాలో బాలకృష్ణ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఓకే ఫ్రేమ్లో తండ్రి కొడుకులను చూపించేందుకు ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. తొందర్లోనే రానున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: