ట్రైలర్: గుస్ బాంప్స్ తెప్పిస్తున్న అంజలి బహిష్కరణ ట్రైలర్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు పొందిన హీరోయిన్ అంజలి ప్రస్తుతం ఎక్కువగా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో వెబ్ సిరీస్లలో నటిస్తు మరింత పాపులారిటీ సంపాదించుకుంటుంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న బహిష్కరణ వెబ్ సిరీస్ నుంచి ప్రతి అప్డేట్ కూడా ఈ సినిమాకి మంచి హైప్ తీసుకువచ్చేలా ఉన్నది. జి ఫైవ్ పిక్చర్స్ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ముఖేష్ ప్రజాపతి ఈ వెబ్ సిరీస్ తలకెక్కించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ జోనర్ లో వెబ్ సిరీస్ ని ఆరు ఎపిసోడ్లుగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

జులై 19వ తేదీన జి ఫైవ్ లో స్ట్రిమింగ్ కాబోతోంది తాజాగా బహిష్కరణ వెబ్ సిరీస్ కి సంబంధించి ట్రైలర్ ని కూడా చిత్ర బృందం ఇటీవలే నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మంచోడు చేసే తప్పేంటో తెలుసా చెడ్డోడు చరిత్ర గురించి తెలుసుకోకపోవడమే అనే డైలాగుతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఒకవైపు పల్లెటూరి అమ్మాయిగా అంజలి, అనన్య నాగళ్ళ, శ్రీ తేజ్ పాత్రల మధ్య సన్నివేశాలు సైతం అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే పల్లెటూరులో ఊరి పెద్ద అతని మనసులు చేసేటువంటి పనులు చూసి.. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటి పల్లెటూరికి పుష్ప అనే అమ్మాయి కూడా వస్తుంది. అయితే ఆమె అక్కడ పరిస్థితులు మార్చేలా చేస్తుంది పుష్ప.. దీంతో ఆ ఊరి పెద్దతో ఆమెకు ఉన్న రిలేషన్ ఏమిటి అమ్మాయిలను ఆట వస్తువులుగా చూసేది ఎవరు ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ బహిష్కరణ సిరీస్ లో ఎదురవుతాయి.. అంజలి పాత్ర విషయానికి వస్తే ఒకవైపు ప్రేమ చూపిస్తూ మరొకవైపు ఆగ్రహంతో ఊగిపోయే పాత్రలో నటించింది.అత్యంత ఉత్కంఠ భరితంగా సాగేలా ఈ ట్రైలర్ ని చిత్ర బృందం కట్ చేశారు. జులై 19వ తేదీన ఈ సిరీస్ జి ఫైవ్ లో స్ట్రిమింగ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: