కమల్ డిమాండ్ మాములుగా లేదుగా.. ఆ పాత్ర కోసం 100 కోట్లు తీసుకున్నాడా?

Purushottham Vinay

ఇండియాలో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు అనగానే.. వెంటనే చాలామంది రజనీకాంత్, ప్రభాస్, అక్షయ్ కుమార్ ఇంకా షారుక్ ఖాన్ పేర్లు చెప్పేస్తారు.. వీరి పారితోషకం కూడా ఏకంగా రూ.100 కోట్ల పైగా ఉంటుంది. అయితే అది సినిమా మొత్తానికి కలిపి రూ.100 కోట్లు ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరూ కాకుండా ఒక హీరో మాత్రం పది నిమిషాలు సినిమాలో కనిపించినందుకు ఏకంగా రూ .100 కోట్లు డిమాండ్ చేశారట.. ఇక ఆయన ఎవరో కాదు.. సీనియర్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్.. కేవలం 10 నిమిషాల కోసం ఏకంగా రూ .100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమాలో కమల్ హాసన్ పాత్ర అనేది చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో సుప్రీమ్ యాస్కిన్ పాత్రను కమలహాసన్ పోషించారు.ఇందులో అన్ని పాత్రలు కూడా ఒక ఎత్తు అయితే కమలహాసన్ పాత్ర మాత్రం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక ఈ పాత్రలో ఆయనను అంత ఈజీగా ఎవరు గుర్తుపట్టరు. అంతలా తన మేకోవర్ మార్చుకున్నారు కమల్ హాసన్. ఏకంగా మేకప్ వేయడానికి మూడు గంటలు సమయం పట్టగా ఆ మేకప్ తీయడానికి రెండు గంటలు సమయం పట్టేదట. 


ఇక ఈ ఛాలెంజింగ్ పాత్రను ఇంత పర్ఫెక్ట్ గా పెర్ఫామ్ చేశారు కాబట్టే ఈ రేంజ్ లో పారితోషకం తీసుకున్నారని సమాచారం తెలుస్తుంది.అయితే ఈ పాత్రలో కమల్ హాసన్ ను తప్పించి ఇంకొకరిని ఊహించలేరు.. కమల్ హాసన్ ఈ మూవీలో కనిపించింది కేవలం 10 నిమిషాల కంటే తక్కువ నిడివి.. ఆయన చాలా చిన్న పాత్ర అయినా సరే మొత్తం సినిమా కథనే మార్చేశాడు. ఇక అందుకే కమల్ హాసన్ కు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా జోరుగా సాగుతోంది. పది నిమిషాల కోసం ఏకంగా రూ .100 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారని తెలీగానే అందరూ షాక్ అవుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది.ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికి వస్తే ..ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు.. ఈ మూవీ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.. మరి ఈ మూవీతో కమల్ హాసన్ ఎలాంటి విజయాన్ని అందుకోబోతున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: