కెరియర్ క్లోజ్ అనే టైమ్ కి హిట్ పడితే ఆ మాజానే వేరు.. అలా హిట్ కొట్టిన హీరోలు వీరే..?
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ అనే మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో రాజేష్ పాత్రలో నటించిన ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈయనకు వరుసగా అవకాశాలు రావడం మొదలు అయ్యింది. అందులో భాగంగా ఈయన కూడా చాలా సినిమాలలో నటించాడు. కానీ ఈయన నటించిన ఏవో ఒకటి, రెండు సినిమాలు తప్పిస్తే ఏవి పెద్దగా విజయాలను అందుకోలేదు. ఈయన కెరియర్ ఆల్మోస్ట్ ముగిసిపోయింది అనే టైం లో ఈయన స్వామి రారా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత నుండి ఈయన ఆచితూచి కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. దానితో ప్రస్తుతం ఈయన తెలుగులో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.