పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు కూడా సలార్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ఐతే ఈ సినిమాల తరువాత వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో రాజా సాబ్ స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇకపోతే కల్కి సినిమా విడుదలై 11 రోజులు అవుతున్నప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం దుమ్ము లేపుతోంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై
తెరకెక్కించారు. అయితే ఇప్పటివరకు అంటే 11 రోజుల వరకు కల్కి సినిమా 950 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. 1000 కోట్లకు చేరువలో ఉన్న ఈ సినిమా కలెక్షన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటుంది. అయితే ఈ సమయంలో ప్రభాస్ -సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కబోయే స్పిరిట్ అనే సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్ వర్గాల్లో మొదలైంది. అదేంటంటే ఈ సినిమాలో సౌత్ కొరియన్ యాక్టర్ ఒకరు నటిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభాస్ టీంని సంప్రదించే ప్రయత్నం చేయగా స్పిరిట్ సినిమాకి సంబంధించి ప్రభాస్
మినహా ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని తేల్చేశారు. నిజానికి ఈ సినిమాకి చాలా సమయమే ఉంది. ఇప్పటికీ ఇంకా ఏమీ ఫైనల్ చేయలేదు. అయితే నిజంగా ఆయన ఈ సినిమాలో నటించినా ఆశ్చర్యం లేదు కానీ ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. సౌత్ కొరియన్ -అమెరికన్ యాక్టర్ గా పేరు ఉన్న మా డాంగ్ సియోక్ కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి సైతం దగ్గరయ్యాడు...!!