హనుమాన్ సినిమాతో సెన్సేషనల్
డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న
ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
తేజ సజ్జ హీరోగా నటించిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ
సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2 కూడా ఉండబోతోంది అని కూడా క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. కాగా దీనికి సీక్వల్ గా జై హనుమాన్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రశాంత వర్మ. అయితే ఈ
సినిమా సక్సెస్ తో ప్రస్తుతం
బాలీవుడ్ బాద్షా
రణవీర్ సింగ్ హీరోగా ఒక
సినిమా చేయబోతున్నాడు. కానీ గత కొద్ది రోజులుగా ఈ
సినిమా క్యాన్సిల్ అయింది అన్న వార్తలు వినబడుతున్నాయి.
అయితే ప్రస్తుతం జై హనుమాన్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు సైతం పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. కానీ పూర్తిగా అది కంప్లీట్ అవ్వడానికి మరో సంవత్సర కాలం పడుతుందని సమాచారం. సీక్వెల్లో హనుమంతుడి పాత్రలో
రామ్ చరణ్ లేదా
చిరంజీవి అయితే బాగుంటుంది అని కామెంట్లు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నిజంగానే ఈ ఇద్దరు హీరోలలో.. ఒకరు ఆ పాత్రలో కనిపిస్తారు అని మెగా అభిమానులు ఫిక్స్ అయిపోయారు. మరోవైపు నందమూరి
బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ అని కూడా
ప్రశాంత్ వర్మ లాంచ్ చేయనున్నారు. ఎప్పటినుంచో నందమూరి అభిమానులు
ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ
సినిమా కాబట్టి దీని మీద కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. మరి ఇన్ని అంచనాల మధ్య రెండు సినిమాలు..
ప్రశాంత్ వర్మ ఎప్పటికీ పూర్తి చేస్తారో వేచి చూడాలి. అయితే ఈ రెండు సినిమాలలో ఏ ఒక
సినిమా కొంచెం అటూ ఇటూ అయినా..
ప్రశాంత్ వర్మ కథ కంచికే అంటున్నారు సినీ విశ్లేషకులు. కాబట్టి
ప్రశాంత్ వర్మ తప్పకుండా ఈ రెండు సినిమాల పైన అత్యంత శ్రద్ధ పెట్టి తీరాల్సిందే...!!