"NBK 109" లో అదే హైలెట్.. అందుకే అలాంటి పని చేస్తున్న డైరెక్టర్..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు చాలా రోజుల నుండి ఓ వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఒక హీరోయిన్ గా ఊర్వశి రౌటేలా ను ఓకే చేశారు. ఇక రెండవ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకుంటున్నట్లు , మరి కొంత మంది పేర్లు కూడా తెర పైకి వచ్చాయి. కానీ మూవీ బృందం మాత్రం ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వల్ యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఇంటర్వెల్ సన్నివేశంలో వచ్చే యాక్షన్స్ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశం లోనే ఒక ట్విస్ట్ రివిల్ కానున్నట్లు , ఆ ట్విస్ట్ బేస్ తోనే సెకండాఫ్ మొత్తం ముందుకు సాగబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఈ ఇంటర్వెల్ సన్నివేశం ఈ సినిమాకు ఎంతో కీలకం కావడంతో ఈ మూవీ దర్శకుడు బాబి ఈ సన్నివేశంపై అత్యంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు , అలాగే చాలా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ హీరోగా నటిస్తూ ఉండడం , వాల్టేర్ వీరయ్య లాంటి విజయం తర్వాత బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల తేదీని మూవీ బృందం వారు ప్రకటించలేదు. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk

సంబంధిత వార్తలు: