ఇండియన్ 2 రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాంచరణ్ ఫ్యాన్స్.. కారణం అదేనా..?

murali krishna
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ ఇండియన్ 2 “.స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో నటించారు. అలాగే ఎస్.జె. సూర్య, సముద్రఖని, బాబీ సింహ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రాంచరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో ఇండియన్ 2 సినిమా షూటింగ్ ప్రారంభించిన కొన్ని నెలల్లో అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీనితో దర్శకుడు శంకర్ గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా మొదలు పెట్టాడు.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. 

అయితే గేమ్ ఛేంజర్” మొదలు పెట్టిన కొంతకాలనికే ఇండియన్ 2 షూటింగ్ కు వచ్చిన అవాంతరాలు తొలిగిపోవడంతో దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాపై  పూర్తి ఫోకస్ చేసారు. దీనితో గేమ్ చేంజెర్ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఎట్టకేలకు ఇండియన్ 2 రిలీజ్ అవుతుందటంతో శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ పై పూర్తి దృష్టి పెట్టాడు. అయితే తాజాగా ఈ సినిమాలో రాంచరణ్ తన పాత్ర షూటింగ్ ముగించుకున్నాడు.. త్వరలోనే ఈ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ ప్రకటిస్తామని దర్శకుడు శంకర్ తెలిపారు. దీనితో ప్రస్తుతం రాంచరణ్ ఫ్యాన్స్ అంతా ఇండియన్ 2 సినిమా కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా హిట్ లేని శంకర్ ఇండియన్ 2 తో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాపై అంత బజ్ లేకపోవడంతో ఇండియన్ 2 సినిమా హిట్ అందుకుంటే రాంచరణ్ సినిమాపై అంచనాలు పెరుగుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: