"ఇండియన్ 2" సెన్సార్ టాక్ లీక్.. మూవీ ఎలా ఉందో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా ఇండియన్ 2 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. ఇక ఇండియన్ మూవీ కి దర్శకత్వం వహించిన శంకర్ ఇండియన్ 2 కి కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు.

ఈ సినిమాను జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వరుస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో కూడా ఈ మూవీ బృందం పాల్గొంటుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా ఈ మూవీ బృందం పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇక ఈ మూవీ మూడు గంటలకు పైగా నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉంటే కొన్ని సినిమాలకు సెన్సార్ సభ్యుల నుండి రివ్యూ బయటకు వస్తూ ఉంటుంది. కానీ ఈ సారి ఈ సినిమాలో హీరో గా నటించిన కమల్ హాసన్ ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ను బయటకు లీక్ చేశాడు. ఆయన తాజాగా మాట్లాడుతూ ... ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు అద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చారు అని అన్నాడు. ఇక కమల్ హాసన్ ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీ అద్భుతంగా ఉంది అని అన్నాడు. కమల్ హాసన్ ఇలా చెప్పడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇది ఇలా ఉంటే అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందించగా , లైకా ప్రొడక్షన్స్ రెడ్ గ్లంట్ సంస్థల వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: