ఎన్టీఆర్ ను వదిలేసి విజయ్ పై పడ్డ దుల్కర్.. ఈసారైనా వచ్చేనా..?

MADDIBOINA AJAY KUMAR
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఇప్పటి వరకు కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న లక్కీ భాస్కర్ అనే స్ట్రీట్ తెలుగు సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

ఈ మూవీ విడుదల తేదీని కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మొదటి భాగం ను కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనితో లక్కీ భాస్కర్ మూవీ విడుదల తేదీ దాదాపుగా మారే అవకాశం ఉంది అని చాలా మంది అంచనా వేశారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా యొక్క విడుదల తేదీ ఆల్మోస్ట్ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ ఈ సినిమాను కనుక సెప్టెంబర్ 7న్వ తేదీన విడుదల చేసినట్లు అయితే ఈ మూవీ కి తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న ది గోత్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైట్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న గోత్ మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రస్తుతానికి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చినట్లు అయితే తెలుగు స్టేట్ లలో లక్కీ భాస్కర్ కి కాస్త కలెక్షన్లు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: