ఇంట్రెస్టింగ్! క‌ల్కి 2లో మ‌రో ప్ర‌పంచం! ఫ్యీజులు ఎగిరి పోవాల్సిందే?

Purushottham Vinay

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇక 9 రోజుల్లో కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో ఏకంగా రూ. 431.55 కోట్ల వసూళ్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హిందీ నుంచి రూ. 171.9 కోట్లు, కన్నడ నుంచి 3 కోట్లు, మలయాళం ద్వారా రూ. 14.9 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఓవర్ సీస్ లో దాదాపు 175 కోట్ల వసూళ్లు వచ్చాయి. దాంతో కల్కి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 9 రోజుల్లోనే ఏకంగా రూ. 800 కోట్లు వచ్చినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే కల్కి సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించాడు. దాంతో అంచనాలు పెరిగాయి. 


అందువల్ల పార్ట్ 2 అంచనాలకి తగ్గట్టు రెడీ చేసి విడుదల చెయ్యాలంటే 2026లోనే సాధ్యం అవుతుంది.పార్ట్ 2 గురించిన కథేమిటి? అనే విషయంలో నాగ్ అశ్విన్ దగ్గర ఓ క్లారిటీ ఉంది. కానీ అందుకు సంబంధించిన స్క్రిప్టు పనులే ఇంకా పూర్తి కాలేదు. 'కల్కి'లో మొత్తం మూడు విభిన్న ప్రపంచాల్ని చూపించాడు నాగ్ అశ్విన్‌. `కల్కి 2`లో కూడా అవే చూపిస్తానంటే ఆడియన్ త్రిల్ ఫీల్ అవ్వడు.కాబట్టి మరో ప్రపంచాన్ని సృష్టించాలి. నాగ్ అశ్విన్ ఈ విషయంలో పక్కా క్లారిటీగా ఉన్నాడు. అశ్వద్దామని ఎదిరించి, సుమతిని తీసుకొని భైరవ వెళ్లిపోవడంతో 'కల్కి 1' సినిమా ముగిసింది. బుజ్జి భైవరని ఎక్కడికి తీసుకెళ్లింది? అక్కడి ప్రపంచం ఎలా ఉంది? అనే సన్నివేశంతో 'కల్కి2' చాలా ఇంట్రెస్టింగ్ వరల్డ్ తో మొదలుకానుంది. ఆ ప్రపంచాన్ని ఇప్పుడు నాగ్ అశ్విన్ కొత్తగా ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నాడట. `కల్కి2`లో నాగ్ అశ్విన్ చూపించబోతున్న 4వ ప్రపంచం ఇదే. ఇప్పుడు ఈ వరల్డ్ ని బాగా బిల్డప్ చేసే పనిలో నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: