రష్మికతో ఈసారైనా.. తారక్ ఛాయిస్ ఎవరు..?

shami
నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ ఫాం కొనసాగిస్తుంది. దర్శక నిర్మాతలంతా కూడా రష్మిక వెంట పడుతున్నారు. అమ్మడు సినిమాలో ఉంటే సినిమాకు కలిసి రావడమే కాదు సక్సెస్ కూడా అవుతుందనే సెంటిమెంట్ ఏర్పడింది. ఈ క్రమంలో రష్మిక కోసం దర్శక నిర్మాతలంగా క్యూ కడుతున్నారు. యానిమల్ హిట్ తో బాలీవుడ్ లో కూడా స్టార్ డం తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా రెండు చోట్ల తన హవా కొనసాగిస్తుంది.
ఐతే స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాల్లో కూడా రష్మిక ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా రష్మికని అనుకుంటున్నారని టాక్. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. ఐతే ఎన్.టి.ఆర్ కి జతగా నటించే ఛాన్స్ రష్మికని వరిస్తుందా లేదా అన్నది చూడాలి. అంతకుముందు కూడా ఒక సినిమాకు తారక్ కి జతగా రష్మికని తీసుకోవాలని అనుకున్నారు కానీ ఎందుకో కుదరలేదు.
ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాకు మాత్రం అమ్మడిని ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. ఐతే రష్మిక కాకపోతే మాత్రం ఆ ఛాన్స్ ని అలియా భట్ కి ఇవ్వాలని చూస్తున్నారట. అలియా భట్ ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటించింది కాకపోతే చరణ్ కి జోడీగా చేసింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ఆమెను తారక్ కి జతగా చేయాలని చూస్తున్నారు. రష్మిక అలియా భట్ ఇద్దరిలో ఒకరినైతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. రష్మిక ఐతే మాత్రం సినిమాకు ప్లస్ అయినట్టే లెక్క. మరోపక్క రష్మిక కూడా ఎన్.టి.ఆర్ లాంటి హీరో పక్కన నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుందని తెలుస్తుంది. తారక్ రష్మిక ఈ జోడీ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: