ప్రభాస్ ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే?

Purushottham Vinay
ప్రభాస్ ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే?  

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ గత 10 సంవత్సరాల నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. తన అభిమానులని అల్లరిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ రికార్డ్ ఓపెనింగ్స్ తో ప్రస్తుతం నెంబర్ 1 హీరోగా దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకి ప్రభాస్ పారితోషికం అనేది పెరుగుతూనే ఉంది.ప్రస్తుతం టాలీవుడ్లో ఏ హీరో తీసుకోనంత రెమ్యునరేషన్ ప్రభాస్ తీసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ సంపాదించుకున్న ఆస్తుల వివరాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.ఇటలీలో ఖరీదైనా విల్లా ఉంది. ఆ విల్లాను టూరిస్టులకు రెంట్ కి ఇస్తూ నెలకు దాదాపుగా రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడట ప్రభాస్.  ఇక హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో అయితే ఏకంగా 60 కోట్ల బంగ్లా..ఒక గార్డెన్, జిమ్, స్విమ్మింగ్ పూల్తో పాటు మరెన్నో సౌకర్యాలతో పాటు సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది.
 ఇక రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుతో పాటు మరెన్నో లగ్జరీ కార్లు ఇంకా అలాగే ఎన్నో లగ్జరీ బంగ్లాలు కూడా ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ఇలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆస్తుల విలువ దాదాపు రూ.250 కోట్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇవన్నీ కూడా ప్రభాస్ కేవలం గత పదేళ్ల నుంచి తన సినిమాల ద్వారా సంపాదించినవే. ప్రభాస్ స్థిరస్తులు కూడా కలుపుకుంటే ఇంకా ప్రభాస్ ఆస్థి డబుల్ ఉంటుందట.


ఇక ప్రభాస్ రీసెంట్ గా నటించిన కల్కి 2898 AD సినిమాకి వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. 5 రోజుల్లో ఏకంగా రూ. 595 కోట్లకు పైగా వచ్చేసాయి. కల్కి కథను సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. హిందీలో కూడా ఇప్పటికీ కల్కి సినిమా వసూళ్లు రూ. 120 కోట్లకి పైగా నెట్ వసూళ్లని దాటేశాయి.ఈ వారం కూడా నిలకడగా వసూళ్లు రాబడితే ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: