కల్కి 2898 AD : హిందీలో రాజమౌళి సినిమాకే దమ్కి.. సౌత్లో కల్కి స్థానం ఏదో తెలుసా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి సిరీస్ మూవీల విజయాలతో హిందీలో అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇక అప్పటి నుండి ఈయన నటించిన సినిమాలకు హిందీలో మంచి కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ నిన్న అనగా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీ నుండి విడుదల అయ్యి హిందీ లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఏ ప్లేస్ లో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 అనే కన్నడ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు 53.95 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 41 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 2 వ స్థానంలో నిలవగా , ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ మూవీ 37.25 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 3 వ స్థానంలో నిలిచింది.

ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో సినిమా 24.4 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానంలో నిలవగా , తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా 22.50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 20.07 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో నిలిచింది. ఇలా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కలెక్షన్ల కంటే కల్కి మూవీకే మొదటి రోజు హిందీ ఏరియాలో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: