ప్రభాస్ " కల్కి " మూవీలో శ్రీకృష్ణుడిగా కనిపించింది ఎవరో తెలుసా..?

lakhmi saranya
నిన్న అనగా జూన్ 27వ తారీఖున ప్రపంచమంతా ఎన్నో రోజులుగా కళ్ళకు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్న సినిమా థియేటర్లలో విడుదలైంది. అదే కల్కి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పూనకాలు పుట్టిస్తుంది. కథ, విజువల్స్ తో పాటు ఊహించని అతిధి పాత్రలతో కల్కి చిత్రం ప్రేక్షకులం ముందుకు వినోదం పంచేందుకు వచ్చింది. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో కృష్ణుడిగా నటించిన వాట్ టు డి గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
కురుక్షేత్రం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో కృష్ణుడి పాత్రధారి ముఖాన్ని చూపించకపోవడమే ఇందుకు కారణం. ఇక ఆ క్యారెక్టర్ పోషించిన వ్యక్తి నడక తీరును పరిశీలించి కొందరు హీరో నాని అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మరి కొంతమంది ఇతర హీరోలా పేర్లు చెప్పడం జరిగింది. సంబంధిత పోస్టర్లపై స్వయంగా ఆ క్యారెక్టర్ ప్లే చేసిన నటుడే సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో ప్రేక్షకుల అంచనాలకు చేత్ పడింది. ఆయన తమిళ నటుడు కృష్ణ కుమార్. ఈయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. డబ్బింగ్ చిత్రం ఆకాశం నీ హద్దురా తో పరిచయమయ్యాడు.
సూర్యా హీరోగా రూపొందిన ఈ సినిమాలో ఆయనకు స్నేహితుడిగా నటించారు కేకే. ధనుష్.. మారన్.. లోను కీలక పాత్ర పోషించారు. కాదళగి తో 2010లో అరంగేట్రం చేసిన ఈయన కి కల్కి మూవీ ఐదో చిత్రం. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడిగా నటించి ఆకట్టుకున్నాడు. అదేవిధంగా దర్శక దిగ్గజుడు రాజమౌళి అండ్ రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కె.వి, నటుడు దుర్కర్ సల్మాన్, ఫరియా అబ్దుల్లా తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ ని షేక్ చేస్తుంది. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా ఆ అంచనాలకు తగిన విధంగా కలెక్షన్స్ ని కూడా రాబడుతుంది. దాదాపు 600 కోట్ల  బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు పూర్తయ్యేసరికి 100 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: