మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కీర్తి సురేష్. ఈమె రామ్ పోతినేని హీరోగా రూపొందిన నేను శైలజ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి వరుసగా టాలీవుడ్ సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.
ఈ సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడం , ఇందులో కీర్తి తన నటనతో ప్రేక్షకులను కట్టి పా.డేయడంతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో ఒక్క సారిగా కీర్తి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. ప్రస్తుతం కీర్తి తెలుగు తో పాటు తమిళ్ లో కూడా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. కెరియర్ ప్రారంభంలో స్కిన్ షో కు చాలా దూరంగా ఉంటూ పద్ధతి గల అమ్మాయి పాత్రలలో నటిస్తూ వచ్చిన కీర్తి ఈ మధ్య కాలంలో కాస్త గ్లామర్ షో ను కూడా మొదలు పెట్టింది.
అందులో భాగంగా కొన్ని సినిమాలలో తన అందాలను కూడా భారీగానే ఆరబోసింది. ఈమె సినిమాలలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అవి సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా ఈమె అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అంతే స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది ప్రస్తుతం. ఈమెకు సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె వరుసగా తెలుగు , తమిళ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.