నార్త్ లో ప్రభాస్ " కల్కి " ఫస్ట్ డే వసూళ్ల ప్రిడిక్షన్.. మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా..!

lakhmi saranya
ప్రజెంట్ ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు కల్కి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని నా అశ్విన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ గా మంచి అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ సినిమా కల్కి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ మరియు దిశా పతాని వంటి స్టార్స్ నటించారు.
అయితే దీంతో పాటుగా నార్త్ మార్కెట్లో ప్రభాస్ కి కూడా మంచి సాలిడ్ బజ్ ఉంది. ఇక ఈ సినిమాలపై కూడా నార్త్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ స్పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం నార్త్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే కల్కి కి మంచి స్వింగ్ లో కనిపిస్తుండగా ప్రెసెంట్ ట్రెండ్ లో ఓపెనింగ్ డే కి టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా 20 కోట్లు కొల్లగొడుతుంది అని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి.
అదేవిధంగా ప్రీమియర్స్ నుంచి కానీ మంచి టాక్ అందుకుంటే ఇంకో ఐదు కోట్లు ఈజీగా కలిపి రాబడుతుందని తెలియజేస్తున్నారు. దీంతో మొదటి రోజే ఒక్క హిందీ వర్షన్ లోనే 25 కోట్లకి పైగా గ్రాస్ ని కలిపి అందుకునేందుకు హాయ్ ఛాన్సెస్ ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి అయితే నార్త్ లో కల్తీ భారీ ఓపెనింగ్స్ కి రంగం సిద్ధం చేసుకుందని తెలుస్తుంది. ఈనెల 27వ తారీఖున రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేరా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ కి మంచి అంచనాలు క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ పై అన్ని ఏరియాల్లోనూ భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: