కాబోయే భర్తకి భారీ బహుమతి ఇచ్చిన శోభా శెట్టి.. ఫొటోస్ వైరల్..!

lakhmi saranya
గత ఏడాది బిగ్ బాస్ 7వ సీజన్లో పాల్గొన్న శోభా శెట్టి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతకు ముందు కార్తీక దీపం సీరియల్ లో మౌనిత అనే విలన్ పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఈ బ్యూటీ. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించింది. కానీ ఈమె గత ఏడాది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడంతో నెగెటివిటీ ఎక్కువైంది. దీనికి పెద్ద రీసన్ ఏం లేదు.
అదంతా పక్కన పెడితే నెలక ముందు యశ్వంత్ అనే నటుడుతో నిశ్చితార్థం చేసుకుంది ఈ బ్యూటీ. కార్తీకదీపం సీరియల్ లో యశ్వంత్ అండ్ శోభా శెట్టి కలిసి నటించారు. అలా షూటింగ్ జరుగుతున్న సమయంలో తొలుత ఫ్రెండ్స్ గా కొనసాగిన వీరు అనంతరం ప్రేమికులు అయ్యారు. బిగ్ బాస్ షో లోనే శోభా శెట్టి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. దీంతో పాటు కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా చేసింది. ఇక ఇప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా లక్షలు విలువ చేసే కారుని బహుమతిగా ఇచ్చింది.
బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని శోభా శెట్టి కొనుగోలు చేసిన ఫోటోలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్కెట్లో ఈ కారు ధర 15 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉంది. ఏదేమైనా పుట్టినరోజుకే ఈ రేంజ్ లో గిఫ్ట్ ఇచ్చిందంటే పెళ్లికి శోభా తన ప్రియుడికి ఎటువంటి గిఫ్ట్ ఇస్తుంది అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా.. అందరికీ నీలాగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు. ప్రజెంట్ ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ మొత్తం తీసుకునే వారే కానీ ఇచ్చేవారు లేరు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: