"దేవర" ఫ్రీ పోన్ కలిసొచ్చింది... "పుష్ప 2" పోస్ట్ పోన్ కలిసొచ్చేనా..?

MADDIBOINA AJAY KUMAR
ఈ సంవత్సరం విడుదల కానున్న అత్యంత భారీ అంచనాలు కలిగిన సినిమాలలో దేవర , పుష్ప పార్ట్ 2 మూవీలు కూడా ఉన్నాయి. దేవర సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తూ ఉండగా కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుండగా ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని కొంత కాలం క్రితం అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా యొక్క షూటింగ్ అనుకున్న దానికంటే చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతుండడంతో ఈ సినిమాను ముందే విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి.  

సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానున్న ఓజి మూవీ పోస్ట్ పోన్ కావడంతో దేవర సినిమాని ఆ తేదీనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా ఈ సినిమా అనుకున్న దానికంటే ముందు విడుదల కానుండడంతో ఈ సినిమాకు పెద్ద మొత్తంలో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే అక్టోబర్ 10వ తేదీతో పోలిస్తే సెప్టెంబర్ 27వ తేదీన చాలా ఎక్కువ హాలిడేస్ ఉండడంతో ఈ మూవీ కి మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే భారీ మొత్తంలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు చాలా వరకు ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తి కావు అని ఉద్దేశంతో ఈ సినిమాని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక దేవర ఫ్రీ ఫోన్ కావడం వల్ల పెద్ద మొత్తంలో లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పుష్ప పార్ట్ 2 పోస్ట్ పోన్ కావడం వల్ల ఆ స్థాయిలో లాభాలను పొందుతుందో లేదో చూడాలి. ఈ రెండు సినిమాలు ఏ తేదీన విడుదల అయినా కూడా మంచి టాక్ వచ్చినట్లు అయితే అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: