చనిపోయేముందు అలాంటి పని చేసిన అలనాటి తార..!!

murali krishna
1953 జులై 24న మద్రాస్‌లో పుట్టారు శ్రీవిద్య. ఆమె తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో కమెడియన్ గా రాణించారు.ఈమె తల్లి పేరు వసంత కుమారి. ఆమె ఓ కర్ణాటక క్లాసిక్ సింగర్. శ్రీవిద్య పుట్టిన కొన్నేళ్లకు ఆమె తండ్రికి పక్షవాతం రావటంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమె తల్లి వసంత కుమారి ఎన్నో కష్టాలు పడి కుటుంబాన్ని పోషించింది. అందుకే శ్రీవిద్య చదువు మధ్యలోనే ఆపేసింది. తన తండ్రి రిఫరెన్స్ లతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. శివాజీ గణేషన్‌ హీరోగా నటించిన తిరువరుచెల్వార్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ” తాత మనవడు” తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఒక్క రూపాయి ఇతరులకు ఇవ్వాలంటేనే కొందరికి ప్రాణం పోతుంది. తమ స్వార్థం తప్ప పరాయి వారి గురించి ఆలోచించే మనస్తత్వం కలిగిన మనుషులు మచ్చుకకు కూడా కనబడరు.అలాంటిది ఓ నటి తన జీవితకాలం సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తిని దానధర్మం చేసింది. ప్రాణం విడిచే ముందు నలుగురికి మంచి చేసి పోయింది. ఆ నటి ఎవరో కాదు శ్రీవిద్య. 1967లో ఆమె కెరీర్ మొదలైంది. మొదటి చిత్రంలో డాన్సర్ గా కనిపించింది. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ హోదా పొందింది. 70-80లలో ఆమె బిజీ యాక్ట్రెస్.
ఏడాదికి 20-30 సినిమాలు చేసేది. శ్రీవిద్య ఎక్కువగా మలయాళంలో చిత్రాలు చేసింది. అలాగే తమిళంలో కూడా నటించింది. ఓ 50 చిత్రాల వరకు తెలుగులో చేసింది. కన్నడ, హిందీ భాషల్లో సైతం నటించింది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో శ్రీవిద్య 800 చిత్రాల వరకు చేసిందని సమాచారం. తెలుగులో ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 90లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.బంగారు బుల్లోడు, ధర్మచక్రం, గాండీవం, ముగ్గురు మొనగాళ్లు వంటి చిత్రాల్లో తల్లి పాత్రలు చేసింది. తెలుగులో శ్రీవిద్య చివరి చిత్రం విజయ్ ఐపీఎస్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు భాషల్లో నటిస్తున్న శ్రీవిద్య అనూహ్యంగా క్యాన్సర్ బారిన పడింది. ఆమెకు అరుదైన బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. 2006లో కీమోథెరపీ చేయించుకుంది. అయినా ఫలితం లేకండా పోయింది. ఆమె శరీరాన్ని క్యాన్సర్ కబళించింది. చనిపోతానని తెలిసిన శ్రీదివ్య తన పేరిట ఉన్న ఆస్తులు ఛారిటీకి దానం చేయాలని నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఆమె ఒక వీలునామా రాశారు. నటుడు కే బి జ్ఞానేశ్వర్ ట్రస్టీగా ఓ ఛారిటీ సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పేరిట తన ఆస్తులు రాసింది. ఆ ట్రస్ట్ ద్వారా సంగీతం, డాన్స్ స్కూల్ నిర్మించి పేద విద్యార్థులకు కళలు నేర్పాలని ఆమె తెలియజేశారు. తన బంధువులకు, పనివారికి కొంత మొత్తం ఆర్థిక సహాయం చేసింది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శ్రీవిద్య… క్రిస్టియన్ అయిన జార్జ్ థామస్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. శ్రీదివ్య డబ్బులతో జల్సాలు చేస్తున్న జార్జ్ కి ఆమె విడాకులు ఇచ్చింది. క్యాన్సర్ కారణంగా శ్రీవిద్య 2006లో కన్నుమూశారు. అప్పటికి ఆమె వయసు కేవలం 53 ఏళ్ళు మాత్రమే…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: