ముంబైలో అభిషేక్ బచ్చన్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

MADDIBOINA AJAY KUMAR
బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బిగ్ బి అమితాబచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన అమితా బచ్చన్ వారసుడిగా హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను హిందీ సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇకపోతే ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన ఈయనకు హీరోగా మాత్రం బ్లాక్ బాస్టర్ విజయాలు దక్కలేదు. ఈయన ధూమ్ సిరీస్ మూవీ లలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం కూడా ఈయన కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఈయన మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అయినటువంటి ఐశ్వర్య రాయ్ నీ పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా వీరి సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతోంది. మధ్యలో కొన్ని సార్లు విడిపోతున్నారు అని వార్తలు వచ్చిన కూడా వాటన్నింటికీ చెక్ పెడుతూ వీరి జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అభిషేక్ బచ్చన్ అత్యంత అధునాతనమైన మరియు విలాసవంతమైన అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మన దేశంలో మంచి గుర్తింపు కలిగిన ఒబేరాయ్ రియాల్టీ అనుబంధ సంస్థ ఇంక్లైన్ రియాల్టీ సంస్థ వద్ద ఈయన 6 అపార్ట్మెంట్ లను కొనుగోలు చేశారు. అభిషేక్ తాజాగా కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ ల విలువ అక్షరాలా రూ.15.42 కోట్లు అని తెలుస్తుంది. ఇంక్లైన్ రియాల్టీ చేపట్టిన ఒబేరాయ్ స్కై సిటీ లగ్జరీ ప్రాజెక్టులో 57 వ అంతస్తులో 4,984 చదరపు అడుగుల విస్తీర్ణం గల అపార్ట్ మెంట్ లను అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అభిషేక్ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ లలో  ఒక్కో చదరపు అడుగు ధర రూ.31,498 అని సమాచారం. ఇలా అభిషేక్ తాజాగా అత్యంత విలాసవంతమైన, అధునాతనమైన, ఖరీదు కలిగిన 6 అపార్ట్మెంట్ లను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: