RC 16 : ఇదెక్కడి స్టార్ కాస్ట్ రా బాబు.. ఆల్రెడీ శివరాజ్ కుమార్ ఓకే.. ఇంకా వారు కూడానా..?

MADDIBOINA AJAY KUMAR
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రామ్ చరణ్, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ లో బాలీవుడ్ నటి జాన్వి కపూర్, రామ్ చరణ్ కి జోడిగా కనిపించనుండగా , కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ మూవీ ని వృద్ధి సినిమాస్, మైత్రి సంస్థ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ మూవీ కథ అద్భుతంగా ఉంది అని, బుచ్చిబాబు తనకు ఈ సినిమా కథను వినిపించిన తర్వాత ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం పక్క అని ఆయనకు అనిపించినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దానితో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇకపోతే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు స్టార్ నటులు కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వారెవరో కాదు కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కిచ్చా సుదీప్ అలాగే తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన విజయ్ సేతుపతి. వీరిద్దరు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బృందం వీరేని కలిసి వీరికి ఈ సినిమా కథను, అందులోని వీరి పాత్రలను వివరించినట్లు వారికి ఈ సినిమా కథ అందులోని తమ పాత్రలో నచ్చడంతో వెంటనే ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విరు కూడా నిజంగానే ఈ సినిమాలో నటించినట్లు అయితే ఈ సినిమా స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: