నేను ఆ నటిలా ఉండడం వల్లే హిందీలో ఆఫర్లు వచ్చాయి.. లేకపోతే నా కెరియర్ అంతే తాప్సి..?

Pulgam Srinivas
మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం సినిమాతో తాప్సి వెండి తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు లో స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె వెంకటేష్ , ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో మాత్రమే కాకుండా గోపీచంద్ లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇక ఆ తర్వాత ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె అనేక హిందీ సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం , ఆమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకోవడంతో ఈమె ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే తాజాగా తాప్సి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా తాను హిందీ సినీ పరిశ్రమలో ఇంతలా సక్సెస్ కావడానికి గల కారణాలను వివరించండి.

తాజాగా తాప్సి మాట్లాడుతూ ... నేను హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటి అయినటువంటి ప్రీతి జింతా పోలికలకు కాస్త దగ్గరగా ఉంటాను. దానితోనే నేను హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వగానే నాకు అవకాశాలు భారీగా దక్కాయి. ఆమె వల్లే నేను హిందీ లో ఇంత స్థాయికి ఎదిగాను అని నేను భావిస్తున్నాను. ప్రీతి జింతా లా కనుక నేను లేనట్లు అయితే నాకు ఇన్ని ఆఫర్లు వచ్చేవి కావు అని నా భావన అని తాప్సి తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: