దేవర : తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియా థియేటర్ హక్కులు ఎవరు దక్కించుకున్నారో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ బృందం వారు అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాలో తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు ఇప్పటికే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏ ఏరియాలో ఎవరు సొంతం చేసుకున్నారు అనే వివరాలను తెలుసుకుందాం. 

ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు దక్కించుకున్నట్లు సమాచారం. అనంతపూర్ మరియు కృష్ణ జిల్లాల థియేటర్ హక్కులను ధీరజ్ మోగినేని ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర థియేటర్ హక్కులను పూర్వి పిక్చర్స్ సంస్థ దక్కించుకోగా, వెస్ట్ ఏరియా హక్కులను ఆదిత్య ఫిలిమ్స్ , ఈస్ట్ థియేటర్ హక్కులను విజయలక్ష్మి ఫిలిమ్స్ , కర్నూలు సురేష్ , కడప శివ , చిత్తూర్ వరద రెడ్డి దక్కించుకున్నట్లు తెలుస్తుంది. 

ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు కలిపి దేవర సినిమాకు 125 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇలా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది వరకు ఎన్టీఆర్, కొరటాల కాంబోలో జనతా గ్యారేజ్ మూవీ రూపొందింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. దానితో విరి కాంబోలో రూపొందుతున్న దేవర సినిమాపై మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: