వరస్ట్ మూవీ.. నా సినిమా నేనే చూడలేకపోయా : కిరణ్ అబ్బవరం

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. అయితే కొంతమంది మాత్రం తమ కష్టాన్ని నమ్ముకుని ఇలా తమ టాలెంట్ నిరూపించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కాగా ఇలా షార్ట్ ఫిలిమ్స్ తో ప్రస్తానాన్ని మొదలుపెట్టి ఇక ఇప్పుడు అటు టాలీవుడ్లో టాలెంటెడ్ యంగ్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు కిరణ్ అబ్బవరం.
 రాజావారు రానివారు అనే సినిమాతో ఇక హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం అనే సినిమాతో వరుసగా రెండో విజయాన్ని అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఇక ఆ తర్వాత సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సినవాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజాన్ లాంటి సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలో అతని కెరియర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి అని చెప్పాలి.

 దీంతో ఒక సాలిడ్ హిట్ కోసం ఈ యంగ్ హీరో ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు. అయితే ఇటీవలే తన సినిమా గురించి కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. అయితే సినిమా బాగా లేకున్నా అందులో హీరోగా నటించిన వాళ్లు సినిమా బాగుందని చెబుతారు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం తన సినిమా నచ్చక వరస్ట్ సినిమా అని ఇంటర్వెల్ నుంచి బయటికి వచ్చేసాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇదేం సినిమా.. వరస్ట్ మూవీ.. ఎవరు చూస్తారు అని నా సినిమా చూస్తున్నప్పుడు నేనే ఇంటర్వ్యూ నుంచి లేచి వచ్చా. దీంతో టీం అందరూ నన్ను తిట్టుకున్నారు. నా పక్కన వాళ్ళు కూడా తిట్టారు. నువ్వే హీరోగా ఉండి నువ్వే ఇలా చేస్తే ఎలా అన్నారు. హీరో అయితే ఎవరైతే ఏముంది మన బాలేనప్పుడు మనం ఒప్పుకొని బయటకు వచ్చేయాలి. దాన్ని రుద్దుతే ఏం వస్తుంది అంటూ కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: