క్లారిటీ లేని స్టార్ హీరోలు... ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న నిర్మాతలు..?

MADDIBOINA AJAY KUMAR
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలను అనౌన్స్ చేసిన తర్వాత వేరే మూవీలకు సంబంధించిన విడుదల తేదీలను దాదాపుగా ఆ మూవీ కి ఒకటి , రెండు వారాలు దగ్గరలో లేకుండా నిర్మాతలు చూసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి అంటే వాటికి హిట్, ఫ్లాప్ టాక్ ఏది వచ్చినా కూడా ఒకటి , రెండు వారాలు ఆ సినిమాలకు జనాలు భారీగా వస్తూ ఉంటారు. కాబట్టి స్టార్ హీరోల సినిమాకు దరిదాపుల్లో ఏ మూవీ నిర్మాత కూడా తన సినిమా ఉండకుండా చూసుకుంటాడు.

కానీ స్టార్ హీరోలు కన్ఫ్యూజన్ లో ముందే విడుదల తేదీలను ప్రకటించడంతో కొంత మంది నిర్మాతలు చాలా సతమతం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం పవన్ హీరోగా నటించిన ఓజి మూవీ ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర మూవీ ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ హీరో గా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

దీనితో ఈ మూడు మూవీలకు దరిదాపుల్లో ఏ సినిమా విడుదల తేదీని చాలా నిర్మాణ సంస్థలు ప్రకటించలేదు. కానీ ఒక్క సారిగా ఓజి మూవీ పోస్ట్ పోన్ కావడంతో దేవర కాస్త ముందుకు వచ్చి సెప్టెంబర్ 27 వ తేదీన దేవర మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పుష్ప పార్ట్ 2 మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కావడం కష్టం అని తెలుస్తుంది. దీనితో నిర్మాతలు ఈ హీరోలు ఎప్పుడు వస్తారు..? వారు ప్రకటించిన తేదీలలో విడుదల తేదీలను ప్రకటిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా..? ఇలా అనేక సమస్యలతో కొంత మంది నిర్మాతలు తాము నిర్మించిన సినిమాలను ఏ తేదీల్లో విడుదల చేయాలో తెలియక సతమతం అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: