ఆ సినిమా టైమ్ లో చాలా ఇబ్బంది పడ్డాను... లావణ్య త్రిపాటి..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో లావణ్య త్రిపాఠి ఒకరు. ఈమె అందాల రాక్షసి మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడం , ఇందులో లావణ్య తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత లావణ్య కి అనేక సినిమాలలో అవకాశం కూడా వచ్చింది. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితమే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

వీరిద్దరూ మొదట శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయం లోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరి కాంబోలో అంతరిక్షం అనే మరో సినిమా కూడా రూపొందింది. ఈ సినిమా సమయం లో విరి ప్రేమ మరింత ముదిరింది. ఇక కొన్ని రోజుల క్రితమే లావణ్య తన పెద్దలను ఒప్పించి వరుణ్ ను పెళ్లి చేసుకుంది. చాలా మంది ముందు వీరిద్దరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఇకపోతే తాజాగా లావణ్య సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది.

అందులో భాగంగా ఓ నేటిజెన్ ఈమెను మీకు చాలా కష్టం అనిపించిన సినిమా ఏదైనా ఉందా అనే ప్రశ్నను అడిగాడు. దానికి లావణ్య సమాధానం ఇస్తూ ... నా కెరియర్ లో నాకు చాలా కష్టంగా అనిపించిన సినిమా అందాల రాక్షసి. ఎందుకు అంటే అప్పుడే నేను కొత్తగా తెలుగు ఇండస్ట్రీ కి రావడం , ఆ సమయం లో నాకు భాష తెలుగు ఏ మాత్రం రాదు. దానితో ఈ సినిమా చేస్తున్న సమయంలో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ఈమె తాజాగా లావణ్య చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: