కొంత కాలం క్రితమే గామి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఫుల్
జోష్ లో ఉన్న
విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్
గోదావరి అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ
మూవీ లో
నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ...
అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై
సూర్య దేవర
నాగ వంశీ ఈ
మూవీ ని నిర్మించాడు. ఈ
మూవీ భారీ అంచనాల నడుమ మే 31 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.
విడుదల అయిన మొదటి రోజే ఈ
మూవీ కి
బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ
మూవీ మంచి కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ
మూవీ పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఈ
మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సమయం లోనే ఈ
మూవీ ని
జూన్ 14 వ తేదీ నుండి
నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు.
దీనితో ఈ
సినిమా కలెక్షన్లు చాలా వరకు తగ్గాయి. ఇకపోతే తాజాగా ఈ
మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ
మూవీ తెలుగు
తమిళ కన్నడ మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ
మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో భారీగా
సక్సెస్ కాలేకపోయినా ఈ
సినిమా ఓ టి టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.