Junior NTR: గోవా నుంచి హైదరాబాద్ కి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్.. లుక్స్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!

lakhmi saranya
Junior NTR: త్రిబుల్ ఆర్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ ఏ విధంగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ అనంతరం నుంచి గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇక త్రిబుల్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ చేస్తున్న తదుపరి చిత్రం దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ముందుగా ఒక బాగానే రిలీజ్ చేయనున్నారు ఈ మూవీ మేకర్స్.
ఇక ఇందులో మొదటి భాగం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల చేత అక్టోబర్ 10వ తేదీకి వాయిదా పడింది. ఆరోజున ఎట్టి పరిస్థితుల్లోనూ దేవర రిలీజ్ అవుతుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ గోవాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో తారక్ కూడా పాల్గొన్నారు. అయితే ఆయన షూట్ పార్ట్ ముగించడంతో ఈరోజు ఆయన గోవా నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దేవర సినిమాలో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి.
ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ లుక్ చూసి ప్రతి ఒక్కరూ ఫీదా అవుతున్నారు. యంగ్ అండ్ మాస్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనమిచ్చాడు. ప్రజెంట్ ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ లుక్ ని చూస్తుంటే దేవరాజ్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో విభత్సంగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ మాస్ అండ్ క్లాస్ కి తగ్గ సినిమాగా ఈ మూవీ రూపొందుతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ విధమైన రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: