ఆ విషయంలో వారితో పోలిస్తే చాలా వెనుకబడిన కాజల్..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు ఎంతో స్ట్రాంగ్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో అనుష్క , సమంత , కాజల్ ముందు వరుసలో ఉంటారు. వీరంతా కూడా ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. అలాగే ప్రస్తుతం కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నారు.

ఇకపోతే లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయానికి వస్తే అనుష్క కెరియర్ ప్రారంభించిన కొంత కాలం లోనే అరుంధతి లాంటి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా ఈమె భాగమతి లాంటి మరో విజయాన్ని కూడా అందుకుంది. ఇక సమంత విషయానికి వస్తే ఈమె కెరియర్ ప్రారంభంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించకపోయిన ఈ మధ్యకాలంలో ఎక్కువ అలాంటి సినిమాలు లోనే నటిస్తోంది.

అందులో భాగంగా యూటర్న్ , యశోద సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా మంచి నటిగా గుర్తింపును కూడా తెచ్చుకుంది. ఇక వీరిద్దరితో పోలిస్తే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో విజయాలను అందుకోవడంలో కాజల్ చాలా వెనుకబడిపోయింది. కెరియర్ ప్రారంభంలో ఈమె ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించలేదు. నటించిన ఒకటి , రెండు కూడా ఈమెకు గొప్ప విజయాలను అందించలేదు.

ఇకపోతే తాజాగా కాజల్ "సత్యభామ" అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో కాజల్ ... అనుష్క , సమంత లతో పోలిస్తే లేడీ ఓరియంటెడ్ మూవీలతో ప్రేక్షకులను అలరించడంలో చాలా వరకు వెనుకబడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: