అప్పుడు వారిద్దరూ... ఇప్పుడు భాగ్యశ్రీ..!

MADDIBOINA AJAY KUMAR
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదగాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంతమంది మాత్రమే వరుస అవకాశాలను దక్కించుకొని స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోతూ ఉంటారు. మరి కొంత మంది మాత్రం నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే భారీ స్థాయిలో అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇక మరి కొంత మంది నటించిన మొదటి సినిమా విడుదల అయిన తర్వాత భారీ స్థాయిలో అవకాశాలను దక్కించుకుంటారు.

కొంత కాలం క్రితం కృతి శెట్టి "ఉప్పెన" అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ విడుదల కాకముందు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాల ద్వారానే ఈమెకు మంచి గుర్తింపు లభించింది. దానితో సినిమా విడుదల కాకముందే ఈమెకు అనేక సినిమాల అవకాశాలు రావడం మొదలు అయింది. ఆ తర్వాత సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఆ అవకాశాలు మరింతగా పెరిగాయి.

ఇలాగే అవకాశాలు దక్కించుకున్న మరో ముద్దుగుమ్మ శ్రీ లీలా. ఈమె నటించిన పెళ్లి సందD సినిమా విడుదల అయిన తర్వాత ఈమెకు వరుస అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటికే ఈమె అనేక సినిమాలలో నటించింది. ఇక అప్పుడు కృతి శెట్టి , శ్రీ లీలా హవా నడిస్తే ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే జోరు ను చూపిస్తుంది. ఈ నటిమని ప్రస్తుతం రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ నుండి కేవలం ఈ బ్యూటీ కి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర ను మాత్రమే మేకర్స్ విడుదల చేశారు.

దీనితోనే ఈమెకు అద్భుతమైన క్రేజ్ లభించింది. దానితో మిస్టర్ బచ్చన్ మూవీ విడుదల కాకముందే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఈమెకు హీరోయిన్ గా అవకాశం దక్కింది. ఇక మరికొన్ని రోజుల్లోనే దుల్కర్ సల్మాన్ హీరోగా పోస్ట్ స్ట్రైట్ తెలుగు మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కూడా ఈమెనే హీరోయిన్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ బ్యూటీ వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఉండటంతో ఈమె కూడా తెలుగులో కృతి శెట్టి , శ్రీ లీల లాగా వరుస అవకాశాలతో దూసుకుపోయే అవకాశం ఉంది అని చాలా మంది అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: