అక్కలు హీరోయిన్స్... చెల్లెలు పెళ్లిళ్లు చేసుకొని సేటిల్డ్..!
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత అనేక విజయవంతమైన సినిమాలలో హీరోయిన్ గా నటించే టాప్ హీరోయిన్స్ స్థానానికి వెళ్ళిపోయింది. ఈమె స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈమె చెల్లెలు అయినటువంటి నిషా అగర్వాల్ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాలలో కూడా నటించింది. కాకపోతే ఈమె కాజల్ అగర్వాల్ స్థాయిలో ఇండస్ట్రీ లో గుర్తింపును సంపాదించలేదు. దానితో కాజల్ పెళ్లి కంటే ముందే ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం కాజల్ పెళ్లి చేసుకుని కూడా సినిమాలలో నటిస్తుంటే నిషా మాత్రం సినిమాలకు పూర్తి స్థాయిలో దూరంగా ఉంటూ తన కుటుంబం తోనే జీవితాన్ని గడుపుతుంది.