నయనతారను చూసి ఈ తరం హీరోయిన్లు ఎంతో నేర్చుకోవాలి... అందుకు ఇదే ఉదాహరణ..?

MADDIBOINA AJAY KUMAR
తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలుపెట్టిన నయనతార చాలా తక్కువ కాలంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు రావడం మొదలు అయింది. దానితో ఈమె తెలుగు లో కూడా సినిమాలు చేసింది. ఈమె నటించిన చాలా తెలుగు సినిమాలు కూడా విజయాలు సాధించడంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరో ప్లేస్ కి వెళ్లిపోయింది.

\

ఇక ఆ తర్వాత ఈమె తెలుగు కంటే కూడా తమిళ సినిమాల్లోనే నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపుతూ వస్తుంది. అందులో భాగంగా ఈమె ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం అద్భుతమైన స్థాయి ఉన్న హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో అనేక అవమానాలను కూడా ఎదుర్కొంది. అందులో ఉదాహరణకు ఒక విషయాన్ని గురించి చెప్పుకుందాం. నయనతార కెరియర్ ప్రారంభం లో సూర్య హీరో గా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన గజినీ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో ఓ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్ కారణంగా దర్శకుడు మురగదాస్ సన్నివేశాన్ని సరిగ్గా చిత్రీకరించలేక పోయాడట. ఆ విషయాన్ని ఆమెకు వివరించి నువ్వు వేసుకున్న డ్రెస్ మార్చుకో అన్నాడట. ఆ వెంటనే ఆమె ముందు చెప్పాలి కదా సార్ , నేను డ్రెస్ తెచ్చుకోలేదు అని అందంట.

దానితో మురగదాస్ అసిస్టెంట్ కి చెప్పి ఫుట్ పాత్ పై ఒక డ్రెస్ ను కొనమని చెప్పాడట. దానితో మురుగదాస్ అసిస్టెంట్ చెప్పినట్లుగానే ఒక డ్రెస్ ను కొని తెచ్చాడట. ఆ తర్వాత మురగదాస్ , నయనతారను పక్కనే ఉన్న కార్ లో ఆ డ్రెస్ మార్చుకొని సెట్ లోకి రమ్మన్నాడట. ఆమె వెంటనే మరో మాట చెప్పకుండా ఇచ్చిన డ్రెస్ తీసుకొని కారులో మార్చుకుందట. ఇక ఆ తర్వాత సన్నివేశాన్ని చిత్రీకరించారట. ఇక ఆ సమయం లో ఆమె కనుక దర్శకుడుతో వాదించినట్లు అయితే ఆ రోజు షూట్ జరిగేది కాదు. కానీ ఆమె అలా చేయలేదు. ఇక ఇలాంటి సన్నివేశాలను నేటితరం హీరోయిన్లు ఆదర్శంగా తీసుకొని మెలగాలి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: