కల్కి షూటింగ్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన దిశా పటానీ..!?

Anilkumar
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాన్ని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కేవలం సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్  సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. డ్రెస్సులు బికినీ వేసుకుంటూ నేటిజన్స్ను ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు బోల్డ్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే తెలుగులో లోఫర్ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ

 తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత ఎంఎస్ ధోని సినిమాతో సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరస సినిమాలు చేసి హీరోయిన్గా సక్సెస్ అయ్యింది. అయితే ఎప్పుడు గ్లామర్ షో తో అదరగొట్టే ఈ బ్యూటీ ఇటీవల సిద్ధార్థ మల్హోత్రా రాశి ఖన్నా నటించిన యాక్షన్ ఫిలిం యోధ లో షాక్ ఇచ్చింది. ఫైట్ సీన్ లో నటించిన ఈమె  ఫైట్ సీన్ తో అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి సినిమాతో ప్రేక్షకుల

 ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.  ఈ సినిమాలో ప్రభాస్ సరసన జోడిగా నటిస్తోంది. నిన్న అంటే సోమవారం రాత్రి కల్కి సినిమా నుండి ట్రైలర్స్ సైతం విడుదల చేశారు చిత్ర బృందం. ఇకపోతే ఇందులో యాక్షన్ అవతారంలో కనిపించింది .ప్రభాస్ తో చిన్నపాటి ఫైట్ సీన్ లో కనిపించింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిశా పటాన్ని ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అదేంటంటే.. ఇంటర్వ్యూలో ప్రభాస్‌ గురించి పొగుడుతూ మాట్లాడింది బోల్డ్ బ్యూటి దిశా పటానీ. "ప్రభాస్ ఒక స్వీట్ పర్సన్. ఆయనతో సినిమాలు చేయడం చాలా సులభంగా, కంపర్ట్‌ఫుల్‌గా ఉంటుంది" అని పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిశా పటానీ తెలిపింది. అలాగే షూటింగ్ మొదటి రోజున ప్రభాస్ తనకోసం మాత్రమే కాకుండా మూవీ టీమ్ మొత్తానికి ఇంటి ఫుడ్ తీసుకొచ్చాడని వెల్లడించింది దిశా పటానీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: