"హరోం హర" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ముగ్గురు యువ నటులు..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సుదీర్ బాబు తాజాగా హరోం హర అనే పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సునీల్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా , జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జూన్ 14వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను ఫుల్ స్పీడుగా ముందుకు సాగిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు.
 

ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు అనగా జూన్ 11 వ తేదీన నిర్వహించబోతున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులు అయినటువంటి సిద్దు జొన్నల గడ్డ , అడవి శేషు , విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా రానున్నట్లు , ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాదు లోని దస్పల్ల కన్వెన్షన్ లో మొదలు కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb

సంబంధిత వార్తలు: