పూరి భార్య గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన హరికృష్ణ..!!

murali krishna
దివంగత హీరో నందమూరి హరికృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు తెలుగులో ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హరికృష్ణ.ఈయన ముక్కుసూటి వ్యక్తి అన్న విషయం మనందరికీ తెలిసిందే.తన చుట్టూ ఉన్న వారిని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్వించేవారు.అలాగే తనకు చేతనైన సహాయం చేస్తుంటారు.సహాయం చేసిన వారిని మరచిపోరు.ఇక హరికృష్ణ కుమారుడు నందమూరి కళ్యాణ్  నటించిన ఇజం చిత్రం సమయంలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగావైరల్ అవుతున్నాయి.డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. ఈయన ఎంతోమంది ఇప్పుడున్న హీరోలను స్టార్లుగా తీర్చిదిద్దారు.అయితే అలాంటి పూరి జగన్నాథ్ భార్య లావణ్య అందరికీ తెలుసు.వీరిద్దరి లవ్ స్టోరీ గురించి కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి.అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే హరికృష్ణ పూరి జగన్నాథ్ భార్య లావణ్య గురించి చెప్పిన వీడియో.అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన ఇజం మూవీ టైం లోది.

అయితే ఈ సినిమాకి డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ చేశారు.ఇక ఈ సినిమా ఈవెంట్ సమయంలో హరికృష్ణ స్టేజ్ పై మాట్లాడుతూ..ఒక సినిమా నిర్మాణం అంటే మామూలు విషయం కాదు.ఆఫీస్ బాయ్ కూడా ఒక చిత్రానికి చాలా ఉపయోగపడతారు. ఆఫీస్ బాయ్ ఇచ్చేమంచి టీతో మన ఎనేర్జి పెరుగుతుంది.డ్రైవర్ మనల్ని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి జాగ్రత్తగా తీసుకుని వెళ్తాడు.నేను మా నాన్న గారికి డ్రైవర్ గా రథ సారధిగా పనిచేశాను.నేను ఓసారి పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లాను. ఆ టైంలో లావణ్య నన్ను చాలా ప్రేమగా పలకరించి ఏం తాగుతారు సార్ అని అడిగింది.నేను కాఫీ తాగుతాను అమ్మా అని చెప్పేసరికి ఆమె అద్భుతమైన కాఫీ ని తీసుకువచ్చి నా చేతిలో పెట్టింది. ఆ కాఫీ అమృతంలా ఉంది అంటూ పూరి జగన్నాథ్ భార్య గొప్పదనం గురించి చెప్పుకొచ్చాడు హరికృష్ణ. ఇక ఆ సమయంలో హరికృష్ణ ని పూరి జగన్నాథ్ ఏంటండీ సార్ కాఫీ గురించి కూడా ఇంత గొప్పగా చెప్పాలా అన్నట్లుగా చూశారట. అయితే ఆయన చూపులను అర్థం చేసుకున్న హరికృష్ణ మీ భార్య ఇచ్చిన కాఫీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఇచ్చిన కాఫీ నేను నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఆమెకు అందరి ముందే కృతజ్ఞత తెలుపుతున్నాను. నేను నా మనసులో ఏది ఉంటే అది బయట పెడతాను అంటూ హరికృష్ణ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: