కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి యాష్ కొంత కాలం క్రితం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ సిరీస్
మూవీ లలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ కంటే ముందు ఈయనకు కేవలం
కన్నడ సినీ పరిశ్రమలో మాత్రమే గుర్తింపు ఉంది. ఎప్పుడు అయితే కే జి ఎఫ్ సిరీస్ సినిమాలు విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్నాయో ఒక్క సారిగా ఈ నటుడికి
ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
ఇకపోతే ఈయనకు మంచి గుర్తింపు రావడంతో ఈయన గతంలో నటించిన సినిమాలను కూడా ఇప్పుడు వేరే భాషలలో విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈయన "కే జి ఎఫ్" సిరీస్
మూవీ ల కంటే ముందు
కన్నడ లో నటించిన ఓ
మూవీ ని "రాజధాని రౌడీ" అనే పేరుతో తెలుగు లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ
మూవీ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
రాజధాని రౌడీ
మూవీ ని ఈ నెల
జూన్ 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే కే జి ఎఫ్ సిరీస్
మూవీ లతో యాష్ కి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. మరి ఆ క్రేజ్ ఈ సినిమాకి ఏమైనా ఉపయోగపడుతుందో చూడాలి. ఇది ఇలా ఉంటే
సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై
నిర్మాత సంతోష్ కుమార్ నిర్మాణంలో , షీనా
హీరోయిన్ గా నటించిన ఈ
మూవీ కి కేవీ రాజు దర్శకత్వం వహించాడు.
ఈ
మూవీ విడుదల సందర్భంగా ఈ
సినిమా నిర్మాత అయినటువంటి
సంతోష్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు , మద్యపానం బారినపడి , నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కధాంశంతో తెరకెక్కిన చిత్రం
రాజధాని రౌడీ. వినోదానికి , సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రమిది అని ఈ
సినిమా నిర్మాత చెప్పుకొచ్చాడు.