"ఎన్బికే 109" ఆ యంగ్ బ్యూటీ.. వైరల్ అవుతున్న పిక్..!

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయన నేపథ్యంలో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్లో 109 వ మూవీగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ ని ఎన్ బి కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం రెండు వీడియోలను విడుదల చేసింది. నిన్న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం ఓ వీడియోని విడుదల చేసింది. 

దానికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటి మనులాలో ఒకరు అయినటువంటి చాందిని చౌదరి ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే తాజాగా ఈ విషయాన్ని ఈమె ధృవీకరించింది. చాందిని ఓ ఇంటర్వ్యూ లో బాగంగా మాట్లాడుతూ ... నేను ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాను. ఆ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదో వచ్చిందా... పోయిందా అన్నట్లు కాకుండా నా పాత్ర ద్వారా ఈ సినిమాలో అద్భుతమైన మెసేజ్ కూడా ఉండబోతుంది అని చెప్పింది.

అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 50% షూటింగ్ పూర్తి అయ్యింది అని , మరికొన్ని రోజుల్లోనే మిగతా షూటింగ్ కూడా పూర్తి కాబోతుంది అని ఈమె తెలియజేసింది. ఇకపోతే తాజాగా ఎన్ బి కే 109 సెట్స్ లో భాగంగా బాలకృష్ణ , చాందిని చౌదరి ఇద్దరు కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ మూవీ కనుక అద్భుతమైన విజయం సాధిస్తే ఈ నటికి అదిరిపోయే రేంజ్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk

సంబంధిత వార్తలు: