ప్రభాస్ ఆస్తిపై కన్నేసిన నెటిజెన్స్..!!

murali krishna
ఉప్పలపాటి ప్రభాస్ రాజు తెలుగు నటుడు. ఇతడు "ప్రభాస్"గా సుపరిచితుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. రీసెంట్ గా కల్కి సినిమాకి సంబంధించి బుజ్జి అనే కార్ ని ఇంట్రడ్యూస్ చేసేముందు గుడ్ న్యూస్ చెబుతాను అని సోషల్ మీడియా ద్వారా స్పందించడంతో చాలామంది తన పెళ్లి విషయం కావచ్చు అని భావించారు.కానీ చివరికి బుజ్జి అనే కార్ ని పరిచయం చేసి అందరికీ నిరాశనే మిగిల్చారు.అయితే ప్రభాస్ 40 ఏళ్లు దాటినా కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నారు.దాంతో ఈయన అభిమానులు అందరూ అసలు ప్రభాస్ పెళ్లి చేసుకోరు కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రభాస్ తన ఒక్కో మూవీకి 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి పాన్ ఇండియా హీరోగా కూడా ఈయన గుర్తింపు సంపాదించారు.అయితే అలాంటి ప్రభాస్ ఇప్పటికే వందల కోట్ల ఆస్తులను సినిమాల ద్వారా సంపాదించారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఈయనకు ఎన్నో రకాల బిజినెస్ లు కూడా ఉన్నాయి. అలా బిజినెస్లు సినిమాల ద్వారా వేల కోట్లు సంపాదించారు. ఇక ఈయనకు లగ్జరీ ఇల్లు,లగ్జరీ కార్లు,బైక్లు ఎన్నో ఫ్లాట్లు కూడా ఉన్నాయి. అయితే ఈయనకు ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి.కాబట్టి పెళ్లి చేసుకోక పోతే ప్రభాస్ ఆస్తి మొత్తం ఎవరికీ వెళ్తుంది అని కొంతమంది ఈయన అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రభాస్ కి ప్రబోద్ అనే అన్నయ్య ప్రగతి అనే సోదరి ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఒకవేళ ప్రభాస్ గనుక పెళ్లి చేసుకోకపోతే ప్రగతి అలాగే ప్రబోద్ ఇద్దరి పిల్లలకు ప్రభాస్ ఆస్తి చెందుతుంది అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.మరి ప్రభాస్ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: