డెలివరీ ముందు బేబీ బంప్ తో అమలాపాల్..!

Anilkumar
సౌత్ సిని ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. ఎక్కువగా బోల్డ్ కంటెంట్ లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నటిగా ఇతర భామల కంటే అమలాపాల్ కాస్త స్పెషల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం కెరియర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితం లో కూడా అమలాపాల్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు అమలాపాల్ తన మొదటి బిడ్డకు జన్మనివ్వడానికి

 సిద్ధంగా ఉంది. ఇక ఈ ఆనందకరమైన సమయాన్ని కేవలం తను మాత్రమే కాకుండా తన అభిమానులతో సైతం పంచుకుంటుంది అమలాపాల్. తన మొదటి బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే తన హోల్ ప్రెగ్నెన్సీ కి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ నే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ తో ఫోటోలని నెట్టింట షేర్ చేస్తూనే ఉంది.. అయితే తాజాగా తన బేబీ బంప్ తో మరొక అర్థమైన వీడియోను తీసి ప్రేక్షకులతో పంచుకుంది. కాగా తన సోషల్

 మీడియా వేదికగా తన బేబీ బంప్ తో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది. అదేంటంటే బేబీ కం డౌన్ అంటూ పా డే సమయం వచ్చింది అనే క్యాప్షన్ జోడించింది. ఇకపోతే అమలాపాల్ త్వరలోనే తన మొదటి బిడ్డకి జన్మనివ్వబోతోంది. మే 8న తనకి 9 వ నెల గర్భం ప్రారంభమైంది. త్వరలోనే డెలివరీ కూడా ఉండబోతోంది. అంతా సాఫీగా జరగాలి అని ఆమె అభిమానులు ఇప్పటినుండి ప్రార్థిస్తున్నారు. ఇక తన కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం తను గర్భవతి కారణంగా సినిమాలకి దూరంగా ఉంది. ఇకపోతే ఆమె ఈ ఏడాది నటించిన ఒక సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యింది. మరి బిడ్డ పుట్టిన తర్వాత అమలాపాల్ సినిమాలు కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది క్లారిటీ లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: