అఫీషియల్ : "ఎన్బికె 109" నుండి అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ గత కొంత కాలంగా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ మూవీ కంటే ముందు కొన్ని అపజాయలను ఎదుర్కొన్న బాలకృష్ణ ఆ మూవీ తో అదిరిపోయే సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇక అప్పటి నుండి పరుసగా వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో విజయాలను అందుకొని ఇప్పటికే హైట్రిక్ విజయాలను అందుకున్నాడు.
 

ఇక ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 109 వ రూపొందుతుంది. దానితో ఈ సినిమా యొక్క చిత్రీకరణను "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ ఒక చిన్న వీడియోని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయి అప్డేట్ ను ప్రకటించింది.

ఈ మూవీ కి సంబంధించిన సూపర్ సాలిడ్ అప్డేట్ ను రేపు అనగా జూలై 10 వ తేదీన ఉదయం 11 గంటల 27 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మూవీ కావడం , వాల్టేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk

సంబంధిత వార్తలు: