మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కు సూపర్ క్రేజ్ లభించింది. ఇకపోతే ఈ సినిమాలో సావిత్రి పాత్రకు మొదట దర్శకుడు నాగ్ అశ్విన్ , కీర్తి సురేష్ ను కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారట.
కానీ వారు ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ స్థానంలోకి కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చింది. అసలు ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి అనే సినిమాను రూపొందించాలి అని అనుకున్న తర్వాత ఒక కథ ను రెడీ చేసుకున్నారు. అదే మహానటి కథ. ఇక ఈ కథలో సావిత్రి పాత్రలో అమలా పాల్ అయితే బాగుంటుంది అని అనుకున్న నాగ్ అశ్విన్ ఆమెను సంప్రదించాడు. కథ మొత్తం విన్న ఈమెకు ఈ సినిమా కథ సూపర్ గా నచ్చినప్పటికీ ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట.
ఇక దానితో చేసేదేమీ లేక నాగ్ అశ్విన్ ఇదే కథను నిత్య మీనన్ కి వినిపించాడట. ఇక నిత్య మీనన్ కూడా ఈ సినిమా కథ విని ఆ సమయం లో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ చేయలేను అని చెప్పిందట. దానితో ఈ సినిమా దర్శకుడు కీర్తి సురేష్ కు ఈ కథను వినిపించడం , ఆమెకు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటిస్తాను అని చెప్పడం , అలా మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.