మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మొదట మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాను ఆ తేదీన కాకుండా జూన్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. మొదటి నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు బాగుండడంతో ప్రేక్షకులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అలాగే కాజల్ కూడా విశ్రాంతి లేకుండా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో ఈ మూవీ లో మంచి మ్యాటర్ ఉండి ఉంటుంది అని జనాలు భావించారు. కానీ మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పెద్ద స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో ప్రదర్శించబడుతున్న భారీ మొత్తంలో కలక్షన్ లను మాత్రం రాబట్ట లేక పోతుంది. తాజాగా ఈ సినిమా ఓ టీ టీ విడుదలకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నట్లు , అందులో భాగంగా ఈ మూవీ కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర , ప్రకాష్ రాజ్ , రవివర్మ , నాగినీడు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాను ఆరమ్ ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించారు.