ఏంటి.. చిరంజీవి విశ్వంభర లో ఆ మెగా హీరో ఉన్నాడా..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎక్కువ రీమేక్  సినిమాలు చేస్తూ వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. అలా చాలా ఫ్లాప్ సినిమాల తర్వాత వాల్తేరు వీరయ్య అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయని సాధించాడు. దాదాపుగా ఈ సినిమా భారీ కలెక్షన్స్  సాధించింది. అయితే ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో చిరంజీవి కాస్త వెనుకబడి ఉన్నారు అని అంటున్నారు చాలామంది .ఒకపక్క బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటుంటే మరొక

 పక్క చిరంజీవి మాత్రం ఫ్లాప్ సినిమాలను ఎంచుకుంటూ విమర్శలను అందుకుంటున్నాడు. అందుకే చిరంజీవి నుండి వచ్చే నెక్స్ట్ సినిమా అయినా బాగుండాలి అని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇక చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా పైనే అందరూ కోటి ఆశలు పెట్టుకున్నారు. బింబిసారా వంటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వశిష్ట అనే దర్శకుడు తో ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలి అని చూస్తున్నాడు చిరంజీవి. అంతే కాదు ఈ సినిమా కోసం అన్ని


 విధాలుగా కష్టపడుతున్నాడు. విజువల్ వండర్ గా వస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. అంతేకాదు ఇందులో చాలామంది యంగ్ హీరో హీరోయిన్లు కూడా ఉండబోతున్నారు అని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వార్తలో వినబడుతున్నాయి. అంతేకాదు ఇప్పటికే చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం పేరు ఉన్న నలుగురు ఐదుగురు హీరోయిన్లను కూడా సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు మరొక మెగా హీరో పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే వరుస డిజాస్టర్ల తో ఫ్లాప్ లో ఉన్న వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి .ఇక ఈ సినిమాలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇదే వార్త ప్రస్తుత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: